మాంజాతో గొంతు తెగి పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం

  • ముంబైలో ఆదివారం రాత్రి ఘటన
  • రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదం
  • బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యుల ప్రకటన
గాలిపటం దారానికి మరో నిండు ప్రాణం బలైపోయింది. ముంబైకి చెందిన ఓ కానిస్టేబుల్ మెడకు మాంజా చుట్టుకోవడంతో దుర్మరణం చెందాడు. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. సమీర్ జాదవ్ దిన్‌దోషీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వకోలా వంతెన వద్ద మాంజా ఆయన మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని సియాన్ ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఖేర్వాదీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Mumbai
Crime News

More Telugu News